Lands & Encroachments

కోర్టులో సర్కారీ భూమి.. క్షేత్రంలో ఎందుకీ మౌనం?

కోర్టులో సర్కారీ భూమి.. క్షేత్రంలో ఎందుకీ మౌనం?
కోర్టులో సర్కారీ భూమి.. క్షేత్రంలో ఎందుకీ మౌనం?

69/1పై రెవెన్యూ మాటొకటి.. చర్యలొకటా?

  • వివాదాస్పద స్థలాలకు మున్సిపల్ అనుమతులు ఎలా వచ్చాయన్నది మరో ప్రశ్న
  • 22-A ప్రభుత్వ భూమని హైకోర్టులోనే చెప్పిన రెవెన్యూ శాఖ
  •  జూలై 20న మరో కోర్టు ఉత్తర్వు.. రెండు నెలలు దాటినా తేలని హద్దులు
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ :
కోర్టులో మాత్రం ఇది ప్రభుత్వ భూమి అంటారు.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి హద్దులు తేలాలి.. పై అధికారులకు రాశాం అంటున్నారు. మరి మియాపూర్‌ సర్వే నంబర్‌ 69/1 విషయంలో అసలు రెవెన్యూ శాఖ వైఖరి ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న స్థానికంగా చర్చకు దారితీస్తోంది.

W. P. No. 38364/2025లో Plot No.32 విషయంలో ప్రభుత్వ తరఫున రెవెన్యూ శాఖ స్పష్టమైన వాదన చేసింది. మియాపూర్‌ సర్వే నెంబర్. 69/1లో 19 ఎకరాల 14 గుంటలు సర్కారిభూమి 22-A ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందని, సర్వే నెంబర్.224గా చెబుతున్న నిర్మాణం చేస్తున్నారని కానీ వాస్తవానికి 69/1లోనే ఉందని కోర్టుకు తెలిపింది. అదే నిర్మాణానికి పెర్మిట్ నెం.0666/GHMC/IA/C21/2025 ఆధారంగా పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. తర్వాత పక్కనే ఉన్న ప్లాట్ నెం.30 పార్ట్ మరియు 31 పార్ట్ కు పెర్మిట్ నెం.4331/GHMC/SLP/2025-BP ఆధారంగా W.P.No.23116/2026 దాఖలైంది. దీని ఆధారంగా జూలై 20న హైకోర్టు డ్యూ ప్రాసెస్ లేకుండా నిర్మాణంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అయితే ఈ ఉత్తర్వు లో నిర్మాణం జరుగుతున్నా స్థలం సర్వే నెంబర్ 224లోనే ఉందని గానీ లేదా 69/1 కాదని గానీ తేల్చలేదు. ఇక్కడే అధికారులకు అసలు పరీక్ష మొదలైంది. కోర్టు చర్యలు తీసుకోవద్దని చెప్పలేదు, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించమని మాత్రమే చెప్పింది. కోర్ట్ ఉత్తర్వుల జులై లో ఇచ్చిన రెవెన్యూ మాత్రమే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంది. 

ఇంకోవైపు, భూమిపై పాత వివాదాలు, సర్వే ఓవర్లప్ ఆరోపణలు ఉండగానే మున్సిపల్ శాఖ బిల్డింగ్ పెర్మిషన్స్ ఎలా జారీ చేసిందన్న ప్రశ్న కూడా ఉత్పన్నామౌతుంది. స్థలాన్ని పరిశీలించిన అధికారులు రెవిన్యూ స్టేటస్ , 22ఏ అంశం, పెండింగ్ డిస్పట్స్ తనిఖీ చేశారా? లేక పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారా? అనే ప్రశ్న అందరి మదిలో మేదులుతుంది.

కోర్టులో ప్రభుత్వ భూమని వాదించిన రెవెన్యూ శాఖ అదే భూమిపై నిర్మాణాలు ముందుకు సాగుతుంటే ఎందుకు వేగంగా స్పందించడం లేదు? మున్సిపల్ అనుమతులు ఎవరి పరిశీలనతో వచ్చాయి? ఈ రెండు శాఖలు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder