ASTHRAM DAILY
Crime

దుర్గం చెరువులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి మిస్టరీ!

సామాన్యుడి అస్త్రం / మాదాపూర్ : స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కథ విషాదాంతమైంది. సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ఎడుబిల్లి రాజేష్ (25) మృతదేహాన్ని మంగళవారం డీఆర్‌ఎఫ్ బృందాలు దుర్గం చెరువులో గుర్తించి వెలికితీశాయి. మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నాచారంలో నివసిస్తున్న ఎడుబిల్లి రాజేష్ కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 26న తెల్లవారుజామున 2 నుంచి 2.30 గంటల మధ్య మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని తన స్నేహితుడి గదికి వెళ్లాడు.


 అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య ఓ స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత రాజేష్ కనిపించకుండా పోయాడు.
స్నేహితులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాజేష్ అక్క ఎడుబిల్లి సంధ్యారాణి (26) మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరకు మంగళవారం దుర్గం చెరువులో అతడి మృతదేహాన్ని డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించాయి.

అయితే రాజేష్ చెరువులోకి ఎలా వెళ్లాడు? ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. మృతికి దారితీసిన పరిస్థితులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాలతో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder