ASTHRAM DAILY
Hyderabad

బైక్‌తో నాలాలో చిక్కుకున్న డెలివరీ ఉద్యోగి.. కాపాడిన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌!

  • విఠల్‌రావునగర్‌ సమీపంలో భారీ నీటి ప్రవాహంతో ప్రమాదం
  •  జెప్టో డెలివరీ ఉద్యోగి అర్జున్‌కుమార్‌ను సురక్షితంగా బయటకు తీసిన బృందాలు
  •  ప్రవాహ ఉద్ధృతితో నాలాలోనే బైక్‌.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పోలీసులు
సామాన్యుడి అస్త్రం / విఠల్‌రావునగర్‌: భారీ నీటి ప్రవాహం ఓ డెలివరీ ఉద్యోగిని ప్రమాదంలో పడేసింది. బైక్‌తో సహా నాలాలో చిక్కుకున్న ఆయనను పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. విఠల్‌రావునగర్‌ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జెప్టోలో డెలివరీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్‌కుమార్‌ (46) భారీ నీటి ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు బైక్‌తో సహా నాలాలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అర్జున్‌కుమార్‌ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆయనను రక్షించినప్పటికీ బైక్‌ను ఇంకా బయటకు తీయలేకపోయారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వాహనాన్ని వెలికితీయడం సాధ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో పరిస్థితిని పోలీసు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.


Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder