ASTHRAM DAILY
Hyderabad

కొత్త బోర్లపై సర్కారు ఆంక్షలు.. మూడు బోరు బండ్లు సీజ్!

భూగర్భ జలాల పరిరక్షణకు రెవెన్యూ అధికారుల చర్యలు

  • నిర్మాణాలకు కొత్త బోర్ల అనుమతులపై ఆంక్షలు విధించాలన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
  •  కొండాపూర్‌లో రెండు, గోపన్నపల్లిలో ఒక బోరు బండి సీజ్ఎ
  • మ్మార్వో మహిపాల్‌రెడ్డి ఆదేశాలతో ఆర్‌ఐ ఇంద్రసేనారెడ్డి చర్యలు
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి.. నిర్మాణాల కోసం కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో రెండు, గోపన్నపల్లిలో ఒకటి చొప్పున మొత్తం మూడు బోరు బండ్లను సీజ్ చేశారు. కొత్తగా బోర్లు తవ్వుతున్నారంటూ అందిన ఫిర్యాదుల మేరకు శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఈ చర్యలు చేపట్టారు.

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీటి కొరత తలెత్తే ప్రమాదముందన్న అంచనాల నేపథ్యంలో అక్టోబర్ 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హైదరాబాద్‌లో భవన నిర్మాణాలు, ఇతర తాగునీటియేతర అవసరాలకు కొత్త బోర్ల అనుమతులను నిలిపివేయాలని సూచించారు. తాగునీటి అవసరాలకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న బోర్లను మరింత లోతు చేయడంపైనా నియంత్రణ పాటించాలని సూచించారు.

మరోవైపు ప్రజలు నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి రెవెన్యూ అధికారులు మూడు బోరు బండ్లను సీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మార్వో మహిపాల్‌రెడ్డి సూచించారు. అక్రమ నీటి తోడకను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder