మొబైల్ రీఛార్జ్ చేసే సమయంలో తొందరపాటు లేదా నిర్లక్ష్యం కారణంగా తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇలా జరిగిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈజీగా రీఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
జియో వినియోగదారులు తప్పుగా చేసిన రీఛార్జ్‌ను రద్దు చేసుకునేందుకు ‘మై జియో’ యాప్‌ను ఉపయోగించవచ్చు. యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత రీఛార్జ్ వివరాల విభాగంలోకి వెళ్లి, అందుబాటులో ఉన్న క్యాన్సిల్ ఆప్షన్ ద్వారా రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లు ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ యాప్‌లో హెల్ప్ సెక్షన్‌కు వెళ్లి, ‘రాంగ్ రీఛార్జ్ రివర్సల్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే తప్పుగా చేసిన రీఛార్జ్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.
వీఐ వినియోగదారులు కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించి తప్పుగా జరిగిన రీఛార్జ్‌పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. వివరాల పరిశీలన అనంతరం అర్హత ఉంటే రీఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే రీఛార్జ్ చేసిన వెంటనే చర్యలు తీసుకుంటే డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.