Telangana

మియాపూర్‌ బ్యూటీ రంగంలో కొత్త చిరునామా.. ‘క్లారా బ్రైడల్ స్టూడియో’

మియాపూర్‌ బ్యూటీ రంగంలో కొత్త చిరునామా.. ‘క్లారా బ్రైడల్ స్టూడియో’
  • బిగ్‌బాస్‌ విజేత కల్యాణ్‌ పడాల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం
  • టేస్టీ తేజ, అగ్నిపరీక్ష రామకృష్ణ రాకతో సందడి
  • ఆధునిక బ్రైడల్‌, బ్యూటీ, ఫ్యాషన్‌ సేవలకు ఒకే వేదిక
సామాన్యుడి అస్త్రం / మియాపూర్:
అందం, ఫ్యాషన్‌, బ్రైడల్‌ సేవల్లో సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మియాపూర్‌లో ఏర్పాటు చేసిన ‘క్లారా బ్రైడల్ స్టూడియో’ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. మియాపూర్‌ మెట్రో సమీపంలోని కెల్వరీ టెంపుల్‌ లైన్‌లో కొలువుదీరిన ఈ స్టూడియోను బిగ్‌బాస్‌ విజేత కల్యాణ్‌ పడాల చేతుల మీదుగా ప్రారంభించారు.
బిగ్‌బాస్‌ ఫేమ్‌ టేస్టీ తేజ, అగ్నిపరీక్ష ఫేమ్‌ రామకృష్ణ ప్రత్యేక అతిథులుగా హాజరై వేడుకకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. అతిథులు, అభిమానులు, స్థానికులు, బ్యూటీ–ఫ్యాషన్‌ రంగానికి చెందిన పలువురితో ప్రారంభోత్సవ ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా కల్యాణ్‌ పడాల మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా యువతుల అభిరుచులను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో బ్రైడల్‌ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ క్లారా బ్రైడల్‌ స్టూడియో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. టేస్టీ తేజ, రామకృష్ణ కూడా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పెళ్లి వేడుకలో వధువును మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దే బ్రైడల్‌ మేకప్‌తోపాటు బ్యూటీ, ఫ్యాషన్‌కు సంబంధించిన విభిన్న సేవలను నిపుణుల పర్యవేక్షణలో అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యత, ఆధునికత, వినియోగదారుల సంతృప్తికే తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి హాజరై తమను ప్రోత్సహించిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు, వినియోగదారులు, స్థానికులకు క్లారా బ్రైడల్‌ స్టూడియో నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder