- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆరోగ్య పరిస్థితిపై ఆరా
- చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం
- వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్: అనారోగ్యంతో హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు.
ఆస్పత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. గవర్నర్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనాలని సీఎం ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. వైద్యులు, అధికారుల నుంచి గవర్నర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.