- హుడా కేఫ్ వద్ద జయశంకర్ విగ్రహానికి పూలమాలలు
- కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం
- జయశంకర్ ఆశయాలను ప్రతి తెలంగాణ పౌరుడు కొనసాగించాలని పిలుపు
సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా జీవించి, ఆరు దశాబ్దాల ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశను చూపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని హఫీజ్‌పేట్ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో హుడా కేఫ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్‌కుమార్ సేనాపతి, పార్టీ సీనియర్ నాయకుడు, టీఏసీ సభ్యుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రతి గుండెకు చేర్చిన ఉద్యమ స్ఫూర్తిప్రదాత జయశంకర్ అని వారు కొనియాడారు. “పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది” అనే నినాద స్ఫూర్తిని తన జీవితంతో చాటిన మహనీయుడు జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేసి, రాష్ట్ర సాధన అవసరాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సిద్ధాంతకర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం రాజకీయ నినాదంగా మిగిలిపోకుండా ప్రజల ఆకాంక్షగా మారడంలో జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు. ఆయనను స్మరించుకోవడం అంటే కేవలం పూలమాలలు వేయడం కాదని, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలను ప్రతి తెలంగాణ పౌరుడు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిగౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, నాయకులు సత్యనారాయణరాజు, శేఖర్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, రామ్‌రెడ్డి, శ్రీకాంత్, లోకేష్, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.